పుణె కారు ప్రమాదం ఘటనలో మైనర్కు బెయిల్ క్యాన్సిల్

పుణె కారు ప్రమాదం ఘటనలో మైనర్కు బెయిల్ క్యాన్సిల్

పుణె కారు ప్రమాద ఘటనలో నిందితుడు మైనర్ బెయిల్ ఆర్డర్ ను జువైనల్ కోర్టు రద్దు చేసింది. జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోం కు తరలించాలని కోర్టు ఆదేశిం చింది. మైనర్ ను రిమాండ్ కు తరలించేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసు తరపు న్యాయవాది  జస్టిస్ బోర్డును కోరారు. అతడు బయట ఉంటే అంత సురక్షితం కాదని..అతనిపై దాడులు జరిగే అవకాశం ఉందని వాదించారు. అయితే మైనర్ డిప్రెషన్ తో బాధపడుతున్నాడని.. అందుకే అతను తాగడం అలవాటు చేసుకు న్నా డని..తల్లితో ఉండాలనుకుంటున్నాడని  వాదించారు నిందితుడి తరపు న్యాయవాది. వాదోపవాదాలు విన్న తర్వాత జువైనల్ జస్టిస్ బోర్డు మైనర్ ను జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. 

ఆదివారం (మే 19) న పుణెలోని కళ్యాని నగర్ లో అతివేగంగా కారును నడిపి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మైనర్ తండ్రితోపాటు అతడికి మద్యం సప్లయ్ చేసిన రెండు బార్ల యాజమానులనుఅరెస్ట్ చేశారు. బార్లను సీజ్ చేశారు. పుణెలో ఈ కారు ప్రమాద ఘటన రాజకీయ దుమారం రేపింది. నిందితుడిని రక్షించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే, పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. 
ఈ క్రమంలో బుధవారం మైనర్ తండ్రి అగర్వాల్ ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. రిమాండ్ కాపీ ప్రకారం.. విశాల్ అగర్వాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని అందువల్ల పుణె పోలీసులు తదుపరి విచారణ కోసం అతడిని కస్టడీకి కోరారు.