కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

బెంగళూరు: ప్రముఖ కన్నడ హీరో, అభిమానులు పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్‌ (46) మృతి చెందారు. జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో శుక్రవారం ఉదయం ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. ప్రత్యేక వైద్యుల బృందం పునీత్‌ ట్రీట్‌మెంట్ అందిస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ కండీషన్‌ను పరిశీలించింది. కానీ ఆయన్ను కాపాడలేకపోయారు. పునీత్ మృతితో క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హైఅల‌ర్ట్‌ ప్రకటించింది. సీఎం బసవరాజు బొమ్మై స్వయంగా ఆస్పత్రికి చేరుకొని పునీత్ కుటుంబీకులను పరామర్శించారు. పునీత్ మృతితో ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెట్టారు. విక్రమ్ ఆస్పత్రికి శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు.  సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే తన నోట మాట రాలేదని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యానని చిరంజీవి అన్నారు. పునీత్ మరణం తీరని లోటు అని.. చిన్న వయసులోనే ఆయనకు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పునీత్ తనకు అత్యంత ఆప్తుడని, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారని చెప్పారు. ఎప్పుడు బెంగళూరు వెళ్లినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారని.. పునీత్ హఠాత్మరణ వార్త తెలియగానే తన నోట మాట కూడా రావడం లేదని మెగాస్టార్ పేర్కొన్నారు. పునీత్ మృతిపై సంతాపం తెలుపుతూ ప్రముఖ నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్‌తోపాటు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ బాలనటుడిగా వెండితెరకు పరిచమయ్యాడు. పునీత్ తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశాడు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నాడు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి. ఇటీవల ఆయన హీరోగా నటించిన మూవీ ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తల కోసం: 

ఫేస్‎బుక్‎ పేరు మార్పు

ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు: మమతా బెనర్జీ

బాధ్యత లేదా..? జీతం తీసుకుంటలేరా?