ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు.. నేను సీఎం అవ్వాలనుకోవట్లే

ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు.. నేను సీఎం అవ్వాలనుకోవట్లే

పనాజీ: గోవా భవిష్యత్‌ను మారుస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లా గోవాను కూడా బలమైన, శక్తిమంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ‘బెంగాల్ చాలా శక్తిమంతమైన రాష్ట్రం. భవిష్యత్‌లో గోవాను కూడా బలమైన స్టేట్‌గా మార్చాలనేది మా కోరిక. గోవాలో కొత్త ఉదయాన్ని చూడాలనుకుంటున్నాం. మమతా జీ బెంగాల్‌లో ఉంటారు.. ఇక్కడెలా మేనేజ్ చేస్తారని కొందరు అంటున్నారు. ఎందుకు సాధ్యం కాదనేది నా ప్రశ్న. నేను భారతీయురాలిని. నేను ఎక్కడికైనా వెళ్లగలను’ అని దీదీ స్పష్టం చేశారు. 

‘ఢిల్లీ దాదాగిరి ఇకపై నడవదు. నేను బయటి వ్యక్తిని కాను. నేను గోవా సీఎం అవ్వాలని అనుకోవడం లేదు. బెంగాల్ నా మాతృభూమి. గోవా కూడా నాకు మాతృభూమి లాంటిదే’ అని మమతా బెనర్జీ చెప్పారు. గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించేందుకు దీదీ సమాయత్తం అవుతున్నారు. గోవాలో అధికారం సొంతం చేసుకునేందుకు.. బెంగాల్‌లో తమ గెలుపు కోసం కృషి చేసిన ప్రశాంత్ కిషోర్‌ను ఆమె రంగంలోకి దింపారు. పీకేకు చెందిన ఐప్యాక్ టీమ్ గోవాలో టీఎంసీ విజయం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో పీకే కూడా గోవాను పర్యటించడం గమనార్హం. 

మరిన్ని వార్తల కోసం: 

ఫేస్‎బుక్‎ పేరు మార్పు

బాధ్యత లేదా..? జీతం తీసుకుంటలేరా?

ఇది ఎన్నిక కాదు.. ఓట్ల వ్యాపారం