
కర్ణాటక వ్యాప్తంగా విషాదభరిత వాతావరణం కొనసాగుతోంది. పవర్ స్టార్ గా, అప్పుగా అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేసినట్టు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు చేయరాదని భావించి అంత్యక్రియలు రేపు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పునీత్ కుమార్తె ధృతి అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమె.. కొద్ది సేపటి క్రితం బెంగళూరు చేరుకుని...పునీత్ డెడ్ బాడీని ఉంచిన కంఠీరవ స్టేడియానికి చేరుకుంది.