
- యూపీ సీఎం యోగికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని పెంచాలని కోరారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రాహుల్ లేఖ రాశారు. ‘‘హత్రాస్ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. బాధిత కుటుంబాలను కలిసినప్పుడు వాళ్లను ఓదార్చలేకపోయాను. ఈ ఘటనపై నాలాగే మీరూ బాధపడుతున్నారని తెలుసు.
చనిపోయినోళ్లను మనం తిరిగి తీసుకురాలేం. కానీ బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సినఅవసరం ఉన్నది. మృతుల కుటుంబాలకు మీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు. పరిహారాన్ని మరింత పెంచి, వీలైనంత తొందరగా అందజేయండి” అని లెటర్లో విజ్ఞప్తి చేశారు. గాయపడినోళ్లకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని, వాళ్లకు కూడా పరిహారం పెంచాలని రాహుల్ కోరారు.