పంజాబ్​లో కొత్త రూల్

పంజాబ్​లో కొత్త రూల్
  • డ్రంకెన్​ డ్రైవింగ్​లో దొరికితే రక్తదానం చేయాలి
  • పంజాబ్​లో కొత్త రూల్​

చండీగఢ్: తాగి వాహనం నడుపు తూ లేదా సెల్​ఫోన్​ డ్రైవింగ్​చేస్తూ దొరికితే ట్రాఫిక్​ పోలీసులు సాధారణంగా జరిమానా విధిస్తారు. అలాగే డ్రైవింగ్​ లైసెన్స్​ను ​ తాత్కాలి కంగా రద్దు చేస్తారు. సిగ్నల్​ జంప్​ చేసినోళ్లతో కొన్నిసార్లు ట్రాఫిక్​ డ్యూటీ చేయిస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలను చూశాం. అయితే పంజాబ్​లో కొత్త రూల్​​ తెచ్చారు. స్పీడ్​ లిమిట్​ దాటడం, తాగి వాహనం నడిపితే ఇకపై రక్తదానం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫైన్లు చెల్లించాలి. డ్రైవింగ్​ లైసెన్స్​ కూడా తాత్కాలికంగా రద్దవుతుంది.