ముస్తాక్ అలీ టీ20 చాంపియన్ పంజాబ్

ముస్తాక్ అలీ టీ20 చాంపియన్ పంజాబ్

మొహాలీ: అన్మోల్‌‌‌‌ప్రీత్ సింగ్ (61 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో చెలరేగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌లో పంజాబ్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో 20 రన్స్‌‌‌‌ తేడాతో బరోడాను ఓడించి టైటిల్‌‌‌‌ నెగ్గింది. తొలుత అన్మోల్, నేహల్ వాధెర (27 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 నాటౌట్‌‌‌‌) మెరుపులతో పంజాబ్ 20 ఓవర్లలో 223/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన బరోడా 203/7 మాత్రమే చేసి ఓడింది. అభిమన్యు రాజ్‌‌‌‌పుత్‌‌‌‌ (61), నినాద్ రథ్వ (47),  కెప్టెన్ క్రునాల్ (45) పోరాడినా ఫలితం లేకపోయింది. అన్మోల్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌,  పంజాబ్‌‌‌‌ ఓపెనర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించాయి.