రూపాయి తీసుకోకుండా ఆక్సిజన్ ఇస్తున్న ప్రాణదాత

V6 Velugu Posted on Apr 28, 2021

మొహాలి: కరోనా వైరస్​ చాలామంది ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితుల్ని అవకాశంగా మలచుకున్న వాళ్లు లాభాలు సాధిస్తున్నారు. డిమాండ్​ పెరిగినా లాభం వద్దు, నష్టమైనా ప్రజల మేలే ముఖ్యం అనుకున్నాడు ఆర్​.ఎస్​. సచ్​దేవ్​. మొహాలి (పంజాబ్​)లో బిజినెస్​ చేస్తున్న ఆయన ఉచితంగా ఆక్సిజన్​ సిలిండర్లను రీ ఫిల్లింగ్​ చేసి ఇస్తున్నాడు. మొహాలిలోని ఇండస్ర్టియల్​ ఏరియా, ఫేజ్​9లో ఉన్న తన పరిశ్రమ ‘హైటెక్​ ఇండస్ర్టీస్​ లిమిటెడ్’​ దగ్గర సచ్​దేవ్​ కొన్ని రోజుల నుంచి ఉచితంగా మెడికల్​ ఆక్సిజన్​ ఇస్తున్నాడు. కొవిడ్​తో ఐసోలేషన్​లో ఉన్నవాళ్లతోపాటు, ఆస్తమా, క్యాన్సర్​, లంగ్​ ప్రాబ్లమ్స్​, వేరే హెల్త్​ ప్రాబ్లమ్స్​తో ఐసీయులో ఉన్న వాళ్ల తరపున వచ్చినవాళ్లకు రూపాయి తీసుకోకుండా ఆక్సిజన్​ ఇస్తున్నాడు. 

ఖాళీ ఆక్సిజన్​ సిలిండర్లతో ఆక్సిజన్​ తీసుకుపోయేందుకు వందల మంది వస్తున్నారు. స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా ఆక్సిజన్​ దొరకని రోజుల్లో ఉచితంగా ఆక్సిజన్​ ఇస్తున్న సచ్​దేవ్​ని అభినందించని వాళ్లు లేరు. ఆక్సిజన్​ కోసం వచ్చినవాళ్ల వివరాలు, ఫోన్​ నెంబర్లు సేకరించడం కోసం సచ్​దేవ్​ తన కంపెనీలోని ఉద్యోగుల్ని నియమించాడు. ఆ వివరాలు నమోదు చేసుకునేందుకు (ఆక్సిజన్​ తీసుకోవడం కోసం) వచ్చే జనం కూడా ఎక్కువయ్యారు. ఈ ఉచిత ఆక్సిజన్​ ఫిల్లింగ్​ సెంటర్​ దగ్గర గుమిగూడుతున్న జనాన్ని కంట్రోల్​ చేసేందుకు పంజాబ్​ పోలీసులు  సిబ్బందిని నియమించారు.

Tagged punjab, Corona situation, businessman, Amid Corona Scare, Free Oxygen, Rupinder Singh Sachdev

Latest Videos

Subscribe Now

More News