నిరాడంబరంగా పంజాబ్ సీఎం వివాహం

నిరాడంబరంగా పంజాబ్ సీఎం వివాహం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ వివాహం నిరాడంబరంగా జరిగింది. సిక్కు సంప్రదాయ పద్దతిలో డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ ను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మధ్య వివాహ వేడుక జరిగింది. మాన్ పెళ్లికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పంజాబ్ సీఎం పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్ దంపతులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. 

 

కాగా  భగవంత్‌ మాన్‌ కు గతంలోనే ఇందర్‌ప్రీత్ కౌర్‌ తో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్ల వివాహ బంధం తర్వాత ఇందర్‌ ప్రీత్ కౌర్‌, భగవంత్ మాన్ సింగ్ విడిపోయారు. వీరు 2015లో విడాకులు తీసుకున్నారు. 2014లో మాన్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇందర్‌ ప్రీత్ కౌర్‌ పాల్గొన్నారు.