ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

పంజాబ్కు కాబోయే సీఎం, ఆప్ ఎంపీ భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.  ఈ నెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో  ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ప్రజలు భారీ బాధ్యతను అప్పగించినందుకు తాను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు భగవంత్ మాన్ తెలిపారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ నాయకత్వంలో పంజాబ్ ను అభివృద్ది పథంలోకి తీసుకెళ్తానన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సంగ్రూర్ జిల్లాలోని ధురి స్థానం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు భగవంత్ మాన్. 58, 206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.