ప్రధాని పర్యటన రద్దుపై స్పందించిన పంజాబ్ సీఎం

ప్రధాని పర్యటన రద్దుపై స్పందించిన పంజాబ్ సీఎం

చండీఘడ్ : ప్రధాని నరేంద్రమోడీ పర్యటన రద్దుపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందించారు. పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న కేంద్ర హోం శాఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని స్పష్టం చేశారు. ముందుగా హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించిన మోడీ.. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తాను మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాని పాల్గొనే కార్యక్రమ భద్రతా చర్యలను సమీక్షించానని అన్నారు. సభకు జనం రాకపోవడమే ప్రధాని పర్యటన రద్దుకు అసలు కారణమన్న చరణ్జిత్ స్పష్టం చేశారు. సభ కోసం 70,000 కుర్చీలు వేస్తే కేవలం 700 మంది రావడంతో మోడీ వెనక్కి వెళ్లిపోయారని చురకలంటించారు.