విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు

విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు

కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశంలోని స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో విద్యార్థులకు ఈ ఏడాది స్కూళ్లు ఉంటాయో, ఉండవో తెలియని పరిస్థితి. కాగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సిద్ధమవుతున్నాయి. అయితే ప్రతి విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ ఉండటమనేది అసాధ్యం. ధనిక, మధ్య తరగతి వాళ్లకు ఫోన్లు ఉండొచ్చు.. కానీ, పేద విద్యార్థులు ఫోన్లు కొనుగోలు చేయాలంటే చాలా కష్టం. ఇప్పటికే తినడానికే కష్టమవుతుంటే.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు ఎక్కడి నుంచి తేవాలని వారి తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. అలాంటి పేద బాలికలకు తమ రాష్ట్రంలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందచేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 50 వేల స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేసింది. ఆ ఫోన్లన్నీ ఈ రోజు పంపిణీ చేయబడతాయి. ఆ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రారంభించనున్నారు.

ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ‘50,000 స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను సులభతరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలందరికీ ఈ ఫోన్లు అందజేయబడతాయి’ అని ట్వీట్ చేశారు.

‘కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడతాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల రీఒపెనింగ్ తేదీలను ఇంకా నిర్ణయించలేదు. కరోనా పరిస్థితిని విశ్లేషించిన తరువాత పాఠశాలలు మరియు కళాశాలలు తెరవడానికి నిర్ణయం సెప్టెంబరులో తీసుకోబడుతుంది’ అని అమరీందర్ అన్నారు.

ఇదిలా వుండగా.. తమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్కూల్ ప్రచురించిన పుస్తకాలనే కొనాలని ఒత్తిడి చేయోద్దని రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్స్ ప్రచురించిన పుస్తకాలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను ఆదేశించింది.

For More News..

మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలుశిక్ష

ఈటల మీటింగ్లో కరోనా కలకలం