అదరగొట్టిన పంజాబ్ .. రాజస్థాన్‌ టార్గెట్ 188

అదరగొట్టిన పంజాబ్ ..  రాజస్థాన్‌ టార్గెట్ 188

ధర్మశాల వేదికగా రాజస్థా్న్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది .  రాజస్థా్న్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఆరంభంలో తడబడింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన   పంజాబ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ప్రభ్‌ సిమ్రన్‌సింగ్‌ను (2) పరుగులకే ఔట్ అయ్యాడు. 

ఆ తరువాత కెప్టెన్ శిఖర్ ధావన్ తో కలిసి దూకుడుగా ఆడిన  అథర్వ (19) పెవిలియన్‌కు చేరాడు. ఆ తరువాత  కాసేపటికే  శిఖర్ ధావన్‌ (17) కూడా పెవిలియన్‌కు చేరాడు.  ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో అదరగొట్టిన లివింగ్‌స్టోన్ (9) ఈసారి మాత్రం తక్కువ పరుగులకే ఔటై నిరాశపరిచాడు.   ఈక్రమంలో జితేశ్ (44), సామ్ కరన్ (49*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ  భారీ స్కోర్ కు అందించడంలో సహాయపడ్డారు.  

ఇక మ్యాచ్  చివర్లో షారుఖ్‌ ఖాన్ (41*) వీరబాదుడు బాదాడు.  ట్రెంట్ బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్‌, రెండు ఫోర్లు సహా 18 పరుగులు రాబట్టాడు. సామ్ కరన్  కలిసి షారుఖ్‌ ఆరో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 73 పరుగులు జోడించాడు. పంజాబ్ బ్యాటర్లు చివరి రెండు ఓవర్లలో ఏకంగా 46 పరుగులను రాబట్టారు. ఇక రాజస్థా్న్ బౌలర్లలో నవ్‌దీప్‌ సైని 3 వికెట్లు తీయగా, జంపా, బోల్ట్ చెరో వికెట్ తీశారు.  ఇక  ప్లేఆఫ్స్‌ అవకాశాలు చివరి వరకు ఉండాలన్నా రాజస్థాన్‌ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. ఇక పంజాబ్‌ గెలిచినా పెద్దగా ప్రయోజనం లేదు.