
భారత్ వైమానిక దళాలు ఈ తెల్లవారుజామున పాకిస్తాన్ భూ భాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను నాశనం చేసి తిరిగి మన భూభాగంలోకి అడుగుపెట్టాయి. ఈ దాడిలో సుమారు 300 మంది పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటికే ఈ దాడిపై పాక్ ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. దీంతో భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేసింది. తాజాగా పంజాబ్ సీఎం కార్యాలయం కూడా సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు, అనుమానిత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని సూచించింది.