టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్. వరుస సినిమాలు ఫ్లాప్ తర్వాత ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు. తమిళస్టార్ హీరో విజయ్ సేతుపతిని ముందెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో చూపిస్తూ సరికొత్త సంచలనానికి రెడీ అయ్యారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్'. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పూరి మార్క్ తో..
ఒక అంధుడైన యాచకుడు, తన వాళ్ల బతుకులను నాశనం చేయాలని చూసే విలన్లపై తిరగబడితే ఎలా ఉంటుంది? అనే సరికొత్త లైన్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్లాన్ చేశారు. టీజర్‌లో వినిపించే డైలాగ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్, ఆయన రగ్గడ్ లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. చేతిలో గన్స్ పట్టుకుని శత్రువులపై ఆయన చేసే ఊచకోత, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి.
►ALSO READ | Rashmika Mandanna: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక .. సాయి పల్లవి, రుక్మిణి అవుట్‌తో మారిన ఈక్వేషన్స్!
భారీ తారాగణం..
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన గ్లామరస్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తుంది. బాలీవుడ్ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. రమీ (Ramee) ,ర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్ కట్స్ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ 'స్లమ్‌డాగ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి..
