తెలుగోళ్లు తగ్గేదేలే: నాట్స్ 2025లో అల్లు అర్జున్

తెలుగోళ్లు తగ్గేదేలే: నాట్స్ 2025లో అల్లు అర్జున్

‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ అని అమెరికా వేదికగా చెప్పాడు అల్లు అర్జున్. అక్కడ జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ  అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘అమెరికాలో తెలుగు వారంతా ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖపట్నంలో  ఉన్నట్లుగా ఉంది. నన్ను ఇలాంటి అద్భుత ఈవెంట్‌‌‌‌కు ఆహ్వానించినందుకు నాట్స్‌‌‌‌కు ధన్యవాదాలు. పుష్ప స్టైల్‌‌‌‌లో చెప్పాలంటే... ‘నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’.  

మన తెలుగు కల్చర్‌‌‌‌ను భవిష్యత్ తరాలకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  మన తెలుగోళ్లు ఎక్కడున్నా తగ్గేదేలే’.  అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్‌‌‌‌‌‌‌‌, హీరోయిన్  శ్రీలీలతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు  పాల్గొని.. విదేశాల్లోనూ తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌‌‌లో భారీ  పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. 

హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌‌‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నటీనటులను సెలెక్ట్ చేయడం,  లుక్ టెస్టులు చేయడంతో పాటు  ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.