ఎన్నికల ప్రచారంలో ‘పుష్ప’ పాట!

ఎన్నికల ప్రచారంలో ‘పుష్ప’ పాట!

లక్నో: విడుదలై 50 రోజులవుతున్నా ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ‘తగ్గేదే లే..’ అంటున్నారు జనాలు. క్రికెటర్లు కూడా ‘చెప్పు’ స్టెప్పు వేసేస్తున్నారు. సినిమా ఎఫెక్ట్ అంతలా ఉన్నది మరి. ‘‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’’ అంటూ పుష్పరాజ్ పాడుకున్న పాటకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ పాటకు ఉత్తరప్రదేశ్‌‌‌‌లో పొలిటికల్ టచ్ ఇచ్చారు. ‘తూ హై గజబ్ యూపీ.. తేరీ కసమ్ యూపీ’ అంటూ కాంగ్రెస్సోళ్లు కొత్త రాగం అందుకున్నారు. పాటతోపాటు ‘ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినందుకు గర్విస్తున్నాను’ అనే క్యాప్షన్ ఇచ్చి యూపీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇంకేముంది వెంటనే వైరల్ అయింది. అందరినీ ఆకట్టుకుంటోంది. యూపీ గొప్పదనాన్ని వివరిస్తూ లిరిక్స్ రాశారు. కాశీలో గంగా హారతి, తాజ్‌‌‌‌మహల్‌‌‌‌తోపాటు ఝాన్సీ లక్ష్మీబాయ్.. ప్రస్తావన కూడా పాటలో ఉంది.