‘కరోనా బెడ్స్’పై.. లైవ్ డ్యాష్ బోర్డులు పెట్టండి

‘కరోనా బెడ్స్’పై.. లైవ్ డ్యాష్ బోర్డులు పెట్టండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు: దవాఖాన్లలో బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో, ఎంత మం దికి ట్రీట్ మెంట్ చేస్తున్నారో, ఎన్ని బెడ్స్‌/వెంటిలేటర్స్‌ ఖాళీగా ఉన్నాయో.. అందరికీ తెలిసేలా లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఢిల్లీలో వీటిని ఏర్పాటు చేశారని, అక్కడి సాఫ్ట్‌వేర్, టెక్నికల్‌ సమాచారాన్ని తెలుసుకుని రాష్ట్రంలోనూ అమలు చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని బెంచ్ తెలిపింది. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించే ఆస్పత్రుల వద్ద లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ అడ్వకేట్ శివ గణేష్‌ కర్నాటి దాఖలు చేసి వ్యాజ్యాన్ని బుధవారం కోర్టు విచారించింది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని తెలపాలంది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్‌ వేర్‌ తయారు చేస్తోందని కోర్టుకు ఏజీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం