రైతుల నిరసనల్లో విద్రోహులు ఉంటే జైళ్లలో వేయండి

రైతుల నిరసనల్లో విద్రోహులు ఉంటే జైళ్లలో వేయండి

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో లెఫ్టిస్టు-మావోయిస్ట్ వింగ్‌‌కు చెందిన కొందరు చొరబడ్డారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌‌తోపాటు పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ తికైట్ స్పందించారు. నిరసనల్లో లెఫ్టిస్టులు ప్రవేశించారనే విషయం గురించి అన్నదాతలకేం తెలియదన్నారు.

ఒకవేళ నిరసనల్లో విద్రోహ శక్తులు, లెఫ్టిస్టులు, మావోయిస్టులు ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలని రాకేశ్ సూచించారు. ‘విద్రోహ శక్తులు గనుక నిరసనల్లో ఉంటే వారిని సెంట్రల్ ఇంటెలిజెన్స్ పట్టుకోవాలి. ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వారిని జైళ్లలో వేయాలి. మాకైతే అలాంటి వారెవ్వరూ కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే వారిని బయటకు పంపిస్తాం’ అని రాకేశ్ పేర్కొన్నారు.