పీవీ సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు

 పీవీ సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు

గండిపేట్, వెలుగు: 2021–22 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక 8వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును రాజోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (రికార్‌‌‌‌‌‌‌‌), నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ద్వైవార్షిక జాతీయ అవార్డు కింద‌‌‌‌‌‌‌‌ రూ.2 లక్షల నగదు, బంగారు పతకం ఇచ్చారు.  

ALSO READ : నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. ఎవరొస్తారో రండి చూస్కుందాం..

ఈనెల 2న డాక్టర్ ఎ.పద్మరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ఎంపిక కమిటీ బీపీహెచ్, బీఎల్ బీ, బ్లాస్ట్, ముంపు, లవణీయతల‌‌‌‌‌‌‌‌ను నిరోధించే..  సన్నరకం, మొత్తం భారతదేశంలో ప్రభావం చూపిన హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో చేసిన కృషికి డాక్టర్ పి.వి.సత్యనారాయణను అవార్డుకు ఎంపిక చేసింది.