స్టెప్పులేసిన పీవీ సింధు

V6 Velugu Posted on Nov 08, 2021

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు డాన్స్ చేసింది. అవునండీ నిజంగానే.. సరదాగా సింధు స్టెప్పులేసింది. ఎప్పుడూ ప్రాక్టీస్, టోర్నమెంట్లు, ఫిట్ నెస్ అంటూ బిజీగా ఉండే ఈ స్టోర్ట్స్ స్టార్.. ట్రెడిషనల్ వేర్ ధరించి సింపుల్‌గా చిందులేసింది. దివాళి సందర్భంగా సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఈ డాన్స్ వీడియోను సింధు తన ఇనస్టాగ్రామ్‌లో పేజీలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సింధు తన డాన్స్ వీడియోను పోస్టు చేసిన కాసేపటికే లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

ఈ డాన్సింగ్ వీడియోలో సింధు ట్రెడిషనల్ వేర్‌లో మెరిసింది. కాంజీవరం సీ గ్రీన్ కలర్ లెహంగాలో సింధు వావ్ అనిపించేలా కనిపించింది. ఇక వెస్ట్రన్ మ్యూజిక్‌కు సింపుల్‌గా స్టెప్పులేస్తూ.. అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. పద్మ అవార్డును అందుకోవడానికి ముందుగా సింధు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ డాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు సోమవారం సింధు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. 2015లో సింధుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. 2016లో ఖేల్ రత్న అవార్డు కూడా సాధించింది. తాజాగా ఆమె ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డును అందుకుంది. 2020 సంవ‌త్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వ‌రించింది. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీక‌రించారు. ఒలింపిక్ ప్లేయ‌ర్ పుస‌ర్ల వెంక‌ట సింధు రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా.. ఇటీవ‌ల 2020 టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ది. 

Tagged PV Sindhu, PV Sindhu Diwali Dance, pv sindhu dance, pv sindhu award

Latest Videos

Subscribe Now

More News