
హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, పారా షట్లర్ మానసి జోషిని బుధవారం రాజ్ భవన్ లో సన్మానించారు గవర్నర్ నరసింహన్ దంపతులు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..భారత్ సత్తా ఏంటో మన సింధు ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించి, క్రీడల్లో ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్ గా నిలిచిందని కొనియాడారు. ఇదే కాన్ఫిడెన్స్ తో 2020 ఒలింపిక్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని చెప్పారు గవర్నర్.