సింధు నాయకత్వంలో బరిలోకి

సింధు నాయకత్వంలో బరిలోకి
  • ఆసియా బ్యాడ్మింటన్​కు టీమ్​ ఎంపిక

న్యూఢిల్లీ: ఇండియా స్టార్​ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్  ప్రణయ్​.. ఆసియా మిక్స్​డ్​ టీమ్​ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్​షిప్​లో ఇండియా జట్టును నడిపించనున్నారు. వచ్చే నెల 14–19 వరకు దుబాయ్​లో ఈ టోర్నీ జరగనుంది. మెడల్స్​ వచ్చే టోర్నీ కావడంతో టాప్​ ప్లేయర్లను డైరెక్ట్​గా తీసుకున్న బాయ్​.. మిగతా టీమ్​ కోసం ట్రయల్స్​ను నిర్వహించింది. విమెన్స్​ సింగిల్స్​లో సింధుకు తోడుగా ఆకర్షి కశ్యప్​ను తీసుకున్నారు. మెన్స్​లో లక్ష్యసేన్​, ప్రణయ్​ బరిలో ఉన్నారు. ఫ్రెంచ్​ ఓపెన్​ చాంపియన్స్​ సాత్విక్​–చిరాగ్​ షెట్టి, కృష్ణ ప్రసాద్​–విష్ణువర్ధన్​ గౌడ్​..మెన్స్​ డబుల్స్ బాధ్యతలను మోయనున్నారు. విమెన్స్​ డబుల్స్​లో ఆల్​ ఇంగ్లండ్​ సెమీఫైనలిస్ట్​ పుల్లెల గాయత్రి​–ట్రీసా జోలీ, అశ్విని భట్​–శిఖా గౌతమ్ జోడీలను బాయ్​ ఎంపిక చేసింది. మిక్స్​డ్​ డబుల్స్​లో ఇషాన్​ భట్నాగర్​–తానిషా క్రాస్టో ​పై భారం వేశారు. కొవిడ్​ కారణంగా 2021 టోర్నీని నిర్వాహకులు రద్దు చేశారు. టోర్నీకి బలమైన టీమ్​ను ఎంపిక చేశామని  అని బాయ్​ సెక్రటరీ సంజయ్​ మిశ్రా చెప్పారు.