వీడియో వైరల్: రీమిక్స్ సాంగ్ కు పీవీ సింధు స్టెప్పులు

 వీడియో వైరల్: రీమిక్స్ సాంగ్ కు పీవీ సింధు స్టెప్పులు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఒలింపిక్స్లో భారత్కు సిల్వర్ మెడల్ అందించిన క్రీడాకారిణి పీవి సింధు. దీంతో పాటు అనేక అంతర్జాతీయ టోర్నీల్లో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. కోర్టులో ప్రత్యర్థులను రఫ్పాడించే పీవీ సింధు.. ప్లేయరే కాదు..మంచి డ్యాన్సర్ కూడా. అవును..పీవీ సింధు మల్టీ టాలెంటెడ్. కోర్టులో రాకెట్తో అలరించే సింధు..డ్యాన్స్తోనూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. 

హెడ్ షోల్డర్ నీస్, గోమీ గోమీ రీమిక్స్ సాంగ్స్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ను క్రియేట్ చేశాయి. ఈ సాంగ్స్కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రీల్స్ చేస్తున్నారు. తాజాగా పీవీ సింధు కూడా ఈ రీల్స్కు తనదైన శైలిలో స్టెప్స్ వేసింది.  బ్లాక్ పాంట్, కూల్ సన్ గ్లాసెస్‌తో సింపుల్గా డ్యాన్స్ చేసింది. అంతేకాదు.. మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది చెయ్యండి అని క్యాప్షన్ కూడా పెట్టింది. జులై 5న తన పుట్టిన రోజు సందర్భంగా సింధూ ఇలా స్టెప్పులేసింది బ్యాడ్మింటనే ప్రపంచంగా ఉండే సింధు..ఇంత బాగా డ్యాన్స్ వేయగలదా అంటూ ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

పీవీ సింధు డ్యాన్స్ వేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు..గతంలోనూ పలు సాంగ్స్కు ఆమె కాలు కదిపింది. ఓ వెస్ట్రన్ సాంగ్కు సింపుల్ స్టెప్పులేసి అలరించింది. "అద్భుతంగా ఉండటాన్ని మర్చిపోవద్దంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ రీల్పై ఇన్ స్టాలో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయ్.. బీస్ట్ సినిమాలోని ఓలమ్మో పిత్తా పిత్తా దే... పాటకు పీవీ సింధు ఇరగదీసింది. విజయ్ వేసిన స్టెప్స్ వేసి ఔరా అనిపించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

 మొత్తానికి పీవీ సింధు ఆటతో పాటు..తన డ్యాన్స్తోనూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. సంతోషం వేసినప్పుడు..సరదా అనిపించినప్పుడు..ఇలా రీల్స్ చేస్తూ..తనలోని మల్టీ టాలెంట్ను బయటపెడుతోంది. దీంతో బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఇప్పటికే నిరూపించుకున్న సింధుకు హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సింధు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 31 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.