సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21–6, 21–9తో చెన్ సు యు (చైనీస్‌తైపీ)పై ఏకపక్ష విజయం సాధించింది. బలమైన స్మాష్‌లు, ర్యాలీలు, క్రాస్ట్ కోర్టు విన్నర్లతో పాటు నెట్ డ్రాప్స్‌తో కేవలం 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది.
మరో మ్యాచ్‌లో తన్వీ శర్మ 14–21, 14–21తో అకానె యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. 32 నిమిషాల మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ధాటికి తన్వీ తట్టుకోలేకపోయింది. దాంతో వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. చెన్ చెంగ్ కాన్–లియు కాంగ్ హంగ్ (చైనీస్)తో జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో ఎం.ఆర్. అర్జున్–హరిహరన్ 19–21, 9–16 స్కోరు వద్ద మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. దాంతో ప్రత్యర్థులకు వాకోవర్ లభించింది.
