
- పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్లో భారీ ర్యాలీ
నిర్మల్, వెలుగు: అహింసాయుత శాకాహార ప్రపంచం ఏర్పాటు కోసం కృషి చేయాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర వర్మ కోరారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్మల్ లో ‘మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ’ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ధ్యాన అభ్యాసకులు, పిరమిడ్ సేవాదళ్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సదస్సులో చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ.. సొసైటీ వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూగజీవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు.
పిరమిడ్ మెడిటేషన్ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. ధ్యానంతో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. మాంసాహారంతో మనుషులు అనేక రోగాలకు గురవుతున్నా రని, ప్రతి ఒక్కరు శాకాహారం తిని ప్రతిరోజు ధ్యానాన్ని పాటిస్తే ఎలాంటి రోగాలు దరిచేయరవని అన్నారు. కార్యక్రమంలో పీఎస్ఎస్ఎం ప్రతినిధులు మహేందర్ గౌడ్, శ్రీహరి, స్వాతి, రాజేశ్వర్, లక్ష్మి, నరసయ్య, అరుణ్ కుమార్, పలు గ్రామస్తులు, పలు జిల్లాల నుంచి వచ్చిన పిరమిడ్ సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.