కలెక్టర్, సీపీని కలిసిన దసరా ఉత్సవ కమిటీ

కలెక్టర్, సీపీని కలిసిన దసరా ఉత్సవ కమిటీ

ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: ఉర్సు రంగలీలా మైదానంలో త్వరలో జరగనున్న సద్దుల బతకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సత్య శారద, సీపీ సన్ ప్రీత్ సింగ్ ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. 

ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు,  ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్, దామెరకొండ వెంకటేశ్వర్లు. కత్తెరశాల వేణుగోపాల్, బత్తిని అఖిల్ తదితరులున్నారు.