
హైదరాబాద్, వెలుగు: మోడర్న్ క్వాలిటీ ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ క్వాలిజీల్ ఏఐపై మరింత ఫోకస్పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంస్థ ఇప్పటికే 600 మందికి పైగా ఇంజనీర్లకు ట్రైసెంట్రిస్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లలో శిక్షణ ఇచ్చింది. కంపెనీకి భారతదేశం, యూఎస్ గ్లోబల్ సెంటర్లలో 850 మందికి పైగా నిపుణులు ఉన్నారు.
2028 నాటికి 1,200 కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ టెక్నికల్ నైపుణ్యంపై దృష్టి పెట్టామని క్వాలిజీల్ సీఈఓ కళ్యాణ్ కొండ చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించడం వృద్ధికి అత్యవసరమని చెప్పారు. 2021లో స్థాపించినప్పటినుంచి క్వాలిజీల్ 71 శాతం వార్షిక వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.