పోకర్ణా నుంచి అక్షర, అవ్యాన్ క్వార్ట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పోకర్ణా నుంచి అక్షర, అవ్యాన్ క్వార్ట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్: పోకర్ణా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన క్వాంట్రా సర్ఫేసెస్, హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న డిజైన్ డెమోక్రసీ 2025లో తన కొత్త ఇంజినీర్డ్ క్వార్ట్జ్ కలెక్షన్లు అక్షర, అవ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించింది. అక్షర కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఇటలీ కంపెనీ బ్రెటన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏకి చెందిన  క్రోమియా టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. యూవీ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 600 డీపీఐ నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. 

అవ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  క్రియోస్ టెక్నాలజీతో రూపొందించారు.  ఈ సర్ఫేసెస్ 7ఎంఎం నుంచి 30ఎంఎం వరకు మందంతో తయారవుతుండగా, ప్రింటెడ్ క్వార్ట్జ్ సంప్రదాయ టైల్స్ కంటే బలంగా, మన్నికగా ఉంటుందని సంస్థ తెలిపింది.  బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాంట్రా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించామని పోకర్ణా తెలిపింది.