హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ ఆఫర్లను ప్రకటించింది. ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ మోడల్‌ల ధరలను 10శాతం తగ్గించింది. గతంలో వీటి ధరలు వరుసగా రూ. 1,19,525, రూ. 99,757గా ఉండేవి. ఇప్పుడు ఇవి రూ. 1.09 లక్షలు, రూ. 89వేలకు తగ్గాయి. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు ఉంటుంది. శక్తివంతమైన 1500వాట్ల మోటార్ ఉన్న ప్లాస్మా ఎక్స్ కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
