అంత్యక్రియలకు డెడ్ బాడీలతో క్యూ..

అంత్యక్రియలకు డెడ్ బాడీలతో క్యూ..

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ లో  కేసులు సంఖ్య పెరగడంతో పాటు మరణాలు కూడా  పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మృతులకు అంత్యక్రియల కోసం బంధువులు  ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా  మృతులకు అంత్యక్రియల కోసం శ్మశానవాటికల్లో 20 గంటలపాటు క్యూలైన్  లో వేచి ఉండాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరైతే డెడ్  బాడీలను కార్లు, అంబులెన్సుల్లో వేసుకొని అంత్యక్రియల కోసం సిటీలోని  శ్మశానవాటికల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా క్యూలైన్ మాత్రం  తప్పడం లేదు. కరోనా మృతులకే కాదు మామూలు కారణాలతో  చనిపోయినవారికి కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులు  ఎదురవుతున్నాయి. ఒక శ్మశానవాటికలో మంగళవారం ఒక్కరోజే 50 డెడ్  బాడీలకు అంత్యక్రియలు నిర్వహించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం  చేసుకోవచ్చు. 

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలే..
అంత్యక్రియల కోసం శ్మశానవాటికల దగ్గర 16 నుంచి 20 గంటలు వెయిట్  చేయాల్సి వస్తోందని మృతుల బంధువులు వాపోతున్నారు. 'ఇలాంటి దారుణ  పరిస్థితి ఎప్పుడూ చూడలే. డెడ్​ బాడీలతో బంధువులు శ్మశానవాటిక దగ్గర  క్యూ కడుతున్నారు' అని ఢిల్లీలోని మస్సే ఫునెరల్స్ ఓనర్ వినీతా అన్నారు.

హార్ట్ ఎటాక్ తో చనిపోయినా.. క్యూలైన్ తప్పట్లే..
తన తండ్రి గుండెపోటుతో చనిపోయినా.. క్యూలైన్ లో ఉండాలని శ్మశానవాటిక  సిబ్బంది చెప్పారని పారిశ్రామికవేత్త అమన్ అరోరా ఆవేదన వ్యక్తంచేశారు. 'మా  నాన్నకు ఛాతి నొప్పి వస్తే హాస్పిటల్​కు తీసుకెళ్లాం. ఆయనకు ట్రీట్​మెంట్  చేయకుండా ఆస్పత్రి సిబ్బంది కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలన్నారు.  సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో చనిపోయా రు. సుభాష్ నగర్​లోని  శ్మశానవాటికకు వెళ్తే ఉదయం రమ్మన్నారు. రెంటెడ్ ఫ్రిడ్జ్​లో డెడ్ బాడీని పెట్టి   మంగళవారం అంత్యక్రియలు నిర్వహించాం' అని ఆయన చెప్పారు.

చేతులెత్తేస్తున్న అధికారులు
రూల్స్ ప్రకారం కరోనా పేషెంట్ చనిపోతే జిల్లా యంత్రాంగం ఒక వెహికల్ ను  అరేంజ్ చేసి స్టాఫ్ ను కేటాయించి అంత్యక్రియలు నిర్వహించాలి. మృతుల  సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో బంధువులే డెడ్ బాడీలను తమ వెహికల్స్​లో తీసుకెళ్తున్నారు. దీనివల్ల  కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వెయ్యి మరణాల లెక్కలు మిస్సింగ్
ఢిల్లీ సర్కారు లెక్కల్లో వెయ్యి మంది కరోనా మృతుల పేర్లు మిస్సయ్యాయి.  కిందటి వారం కరోనా మృతు లపై అధికారిక లెక్కలకు, శ్మశానవాటికల్లో  అంత్యక్రియల లెక్కలకు పొంతన లేదని ఓ మీడియా సంస్థ వెల్లడించింది.  సుమారు 1,158 మంది మృతుల లెక్కలు అధికారిక డేటా నుంచి మిస్  అయినట్టు తెలిపింది.

శ్మశానంలో ప్లేస్ కూడా ఇవ్వలేరా?
ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నారు.. కనీసం  శ్మశానాల్లో స్పేస్ కూడా కల్పించలేక పోతున్నారని అసిస్టెంట్ ప్రొఫెసర్  మన్మీత్ సింగ్ మండిపడ్డారు.  'మా నాన్న డెడ్ బాడీని సుభాష్ నగర్ క్రెమటోరియంకు తీసుకొచ్చా. ఖాళీ లేదని అంటున్నారు. సీఎన్​జీ  ఛాంబర్లో  ఒక్కసారి 2 డెడ్ బాడీలకు మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని,  ఒక్కో డెడ్ బాడీకి 90 నిమిషాలు పడుతోందని స్టాఫ్​ చెబుతు న్నారు. ఇంకా  24 డెడ్ బాడీలు వెయిటింగ్ లో ఉన్నట్టు చెప్పారు' అని మన్మీత్ ఆవేద న  వ్యక్తం చేశారు.