
- సంక్షేమ హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టట్లే
ముషీరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలోని స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.15కు డబుల్ రొట్టె రాదని, అలాంటిది పూట భోజనం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ లో సంక్షేమ హాస్టల్ స్టూడెంట్ల సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. స్టూడెంట్లకు సరైన ఆహారం అందకపోతే ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.
మెస్ చార్జీలు పెంచకపోవడంతో క్వాలిటీ ఫుడ్పెట్టడం లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ఉన్నతాధికారులు హాస్టళ్లను సందర్శించి, సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నీల వెంకటేష్, చంద్రశేఖర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.