సెప్టెంబర్ 28న గేమ్ చేంజర్ నుండి రా మచ్చా మచ్చా ప్రోమో..

సెప్టెంబర్ 28న  గేమ్ చేంజర్ నుండి రా మచ్చా మచ్చా ప్రోమో..

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ ఇస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం బుధవారం ఓ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు మేకర్స్.  ఈనెల 28న రెండో పాట ‘రా మచ్చా మచ్చా’ ప్రోమోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ చరణ్ లుక్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేస్తోంది.

తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్‌‌‌‌‌‌‌‌ మీట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను అనంత శ్రీరామ్ రాశారు.  ఇక ఇప్పటికే విడుదలైన ‘జరగండి.. జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వాని మరోసారి జంటగా నటిస్తున్నారు. సముద్రఖని, ఎస్‌‌‌‌‌‌‌‌.జె.సూర్య, శ్రీకాంత్,  సునీల్, జయరాం, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది.