‘రాను.. నే బొంబాయికి రాను’ సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సాV3’. సామ్రాట్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ డీమోన్ పవన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ మాయ దర్శకత్వంలో వి. విజయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొని యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తోన్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరారు. ఈ కథను ఓన్ చేసుకుని నటించామని నటీనటులు చెప్పారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ ‘బెస్ట్ అవుట్‌పుట్‌తో షూటింగ్ పూర్తి చేశాం. నటీనటుల పెర్ఫార్మెన్స్‌తోపాటు సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది’ అని అన్నాడు. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, సక్సెస్ వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత విజయ అన్నారు.
