కోల్ మాఫియా గ్యాంగ్ అరెస్ట్.. రూ.కోట్ల విలువ చేసే సామాగ్రి స్వాధీనం

కోల్ మాఫియా గ్యాంగ్ అరెస్ట్.. రూ.కోట్ల విలువ చేసే సామాగ్రి స్వాధీనం

హైద‌రాబాద్: అక్రమంగా నల్ల బొగ్గు రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలోని రాందాస్ పల్లి లో ఈ ముఠా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. లారీల వారితో ఒప్పందం కుదుర్చుకుని అక్ర‌మంగా వ్యాపారం నడిపిస్తున్నట్టు తెలిపారు. విదేశాల‌ నుండి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్ కు తీసుకువచ్చి వాటిని కల్తీ చేసి పంపుతారని.. ఆ స‌రుకును కృష్ణా పట్నం,కొత్తగూడెంకు సరఫరా చేస్తార‌ని చెప్పారు. ఇతర రాష్ట్రాలలోని సిమెంట్ , ఇరన్ ఫ్యాక్టరీలకు కూడా ఈ బొగ్గును సరఫరా చేస్తారని క‌మిష‌న‌ర్ చెప్పారు.

క్వాలిటీ ఉన్న బొగ్గులో లో క్వాలిటీ మిక్స్ చేసి కంపెనీలకు పంపుతారని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో 1050 టన్నుల బొగ్గు, రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలు సీజ్ చేసిన‌ట్టు తెలిపారు. మొత్తం 2.62 కోట్ల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుమ‌న్నామ‌ని అన్నారు. ఈ బొగ్గు మాఫియా లో ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామ‌ని తెలిపారు.

Rachakonda commissionerate: Rachakonda police arrested Coal mafia gang