అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రెండున్నర లక్షలు స్వాధీనం

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రెండున్నర లక్షలు స్వాధీనం

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాపై చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లై చేసినా.. కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మాదక ద్రవ్యాల సప్లై మాత్రం తరుచూ జరుగుతూనే ఉంది. 

తాజాగా అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు నిందితులను మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 2.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడున్నర కిలోల OPM, 45 గ్రాముల పప్పస్ట్రాను సీజ్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.