అందుకే ఆలస్యమైంది

అందుకే ఆలస్యమైంది

గోపీచంద్‌‌‌‌‌‌‌‌తో ‘జిల్’ సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి.. రెండో సినిమానే ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో చేసే చాన్స్ వచ్చింది. అందుకే ‘రాధేశ్యామ్’ని ప్రాణం పెట్టి తీశానంటున్నాడు రాధాకృష్ణ. మార్చి 11న ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించాడు. ‘‘బాహుబలి కంటే ముందే ప్రభాస్‌‌‌‌‌‌‌‌ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. ‘సాహో’ ఫైనల్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నప్పుడు స్టార్ట్ చేశాం. మేకింగ్‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ టైమ్ తీసుకోవడం, తర్వాత కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ వల్లే ఆలస్యమైంది.  కీరో అనే ఫేమస్ యూరోపియన్ పామిస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌తో రాసిన కథ. ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, టాప్ క్లాస్ వాళ్లకి మాత్రమే జ్యోతిష్యం చెబుతారాయన. జ్యోతిష్యం నమ్మేవారికి, నమ్మనివారికి మధ్య తేడానే ఈ సినిమా. జ్యోతిష్యం రైటా, రాంగా అనేది వేల సంవత్సరాలుగా వెంటాడుతున్న ప్రశ్న. మనకి అవసరం లేనిది ఏదైనా అంతరించిపోతుంది. కానీ జ్యోతిష్యం ఇప్పటికీ ఉంది అంటే అందులో నిజం ఉందా, ఉంటే ఎంత పర్సెంట్‌‌‌‌‌‌‌‌ ఉంది, లేకపోతే ఏంటి అనేది చూపించాం. ఇండియాలోని ఓ హిల్ స్టేష‌‌‌‌‌‌‌‌న్​లో తీద్దామ‌‌‌‌‌‌‌‌నుకున్నా. కానీ అబ్రాడ్‌‌‌‌‌‌‌‌లో వింటేజ్ డ్రామాగా తీస్తే బాగుంటుందని ప్రభాస్ అనడంతో యూరప్‌‌‌‌‌‌‌‌ బెటరనుకున్నాం. కానీ ఇటలీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ కనుక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మరికొన్ని దేశాల్లో షూట్ చేయాలనుకున్నా కరోనా వల్ల కుదరలేదు. క్లైమాక్స్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో తీశాం. లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. క్లాస్ లుక్స్‌‌‌‌‌‌‌‌ అంటే నాకిష్టం. ప్రభాస్, పూజాహెగ్డే బెస్ట్ లుకింగ్ పెయిర్. అద్భుతంగా కనిపిస్తారు. హిందీ వెర్షన్‌‌‌‌‌‌‌‌కి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగులో ఎవరిచ్చారనేది త్వరలోనే రివీల్ చేస్తాం. అందరూ అనుకుంటున్నట్టు మహేష్ బాబు మాత్రం కాదు. మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ విషయంలో జస్టిన్ ప్రభాకరన్‌‌‌‌‌‌‌‌ని నేను సెలెక్ట్ చేశాను. హిందీ వెర్షన్ విషయం టీ సిరీస్‌‌‌‌‌‌‌‌ వాళ్లు చూసుకున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో సినిమాని నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లాడు తమన్.  తెలుగు, హిందీల్లో సెపరేట్‌‌‌‌‌‌‌‌గా తీశాం. రన్ టైమ్‌‌‌‌‌‌‌‌ కూడా హిందీలో కాస్త ఎక్కువ. పది నుంచి పన్నెండు దేశాల్లో వీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేశాం. మేజర్ వర్క్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. చెన్నై, ముంబైలలో ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్ ప్లాన్ చేశాం. త్వరలోనే మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం.