
ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ముంబైలో శుక్రవారం (జూలై 12) రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ వారసుడు చిరకాల స్నేహితురాలు అయిన రాధిక మర్చంట్ ను బంధువులు, స్నేహితులు, దేశ విదేశాలనుంచి వచ్చిన వీఐపీల మధ్య వివాహం చేసుకున్నారు.
పాశ్చాత్య సాంప్రదాయంలో గుజరాతీ ఆచారంలో ఈ వివాహ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అనంత్,రాధిక ఒకొరికొకరు వరమాలలు మార్చుకున్నారు. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఒకరికొకరు పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. అయితే అందరిలా కాకుండా వెరైటీగా పెళ్లి ప్రమాణాలు చేశారుఅనంత్, రాధిక. పెళ్లి ప్రమాణంలో తన డ్రీమ్ హౌజ్ గురించి చర్చించినట్లు .. నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో లో కనిపిస్తోంది.
ALSO READ |అనంత్ అంబానీ చొక్కాపై పులితో ఉన్న బ్లూ డైమండ్.. ఎన్ని కోట్లంటే..!
అన్ లైన్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అనంత్ అంబానీ హిందీలో ప్రమాణం చేయగా.. రాధిక మర్చంట్ ఇంగ్లీష్ లో పెళ్లి ప్రమాణాలు చేశారు. అంతేకాదు.. సాంప్రదాయంగా చెప్పుకునే మంత్రాలతోపాటు..తమ వివాహ ప్రమాణంలో తమ డ్రీమ్ హోమ్ గురించి చర్చిస్తూ.. వెరైటీగా ఇంగ్లీష్ హిందీల్లో ప్రమాణాలు చేశారు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్.
ALSO READ | ఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఏ ముహూర్తం.. ఏంటా ఆచారం..?
తమ ఇల్లు ప్రేమ, కలయికల ప్రదేశంగా ఉంటుందని ’’ అనంత్ అంబానీ చెప్పగా.. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే అక్కడే మన డ్రీమ్ హౌజ్.. ఎక్కడికి వెళ్లినా మనం కలిసి ఉండే చోటే ఉంటుంది అని ఇంగ్లీష్ లో రాధిక మర్చంట్ చెప్పగా.. ‘‘రాధికా, శ్రీకృష్ణుల ఆశీస్సులతో మనం ఇద్దరం కలిసి అందమైన కలల ఇంటిని నిర్మిస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను’’అని హిందీలో అనంత్ అంబానీ కొనసాగించారు. చివరగా మా ఇల్లు స్థలం కాదు..మనం ఎక్కడ ఉన్నా అది ప్రేమ , కలయికల అనుభూతి’’ అని జైశ్రీకృష్ణ అంటూ వివాహ ప్రమాణాలను ముగించారు. ఇది వెడ్డింగ్ వేడుకలో ఓ స్పెషల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.