టిల్లు స్క్వేర్.. రాధిక సాంగ్ ప్రోమో రిలీజ్

టిల్లు స్క్వేర్..  రాధిక సాంగ్ ప్రోమో రిలీజ్

గత ఏడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.  వచ్చే ఫిబ్రవరి 9న  ‘టిల్లు స్క్వేర్’తో ఆడియెన్స్‌‌ను పలకరించబోతున్నాడు.  మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ‘రాధిక’ సాంగ్ ప్రోమోను శనివారం రిలీజ్ చేశారు. 

రాధిక అంటే పేరు మాత్రమే కాదంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ మాటలు విని పడిపోయానే.. నీ గాలి సోకితేనే సచ్చిపోయానే’ అంటూ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. రామ్ మిరియాల కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా ఈ పాటను పాడాడు.  ఫస్ట్ పార్ట్‌‌కు ఏమాత్రం తగ్గకుండా రెట్టింపు ఆనందంతో టిల్లు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.