రాధిక శరత్ కుమార్ అప్పులు రూ.14 కోట్లు , 75 తులాల బంగారం

రాధిక శరత్ కుమార్ అప్పులు రూ.14 కోట్లు , 75 తులాల బంగారం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్ లో  తన ఆస్తుల విలువ రూ.53.45 కోట్లుగా ప్రకటించారు.  ఇందులో 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆమె తమిళనాడులోని విరుదునగర్ నుంచి బరిలో ఉన్నారు.  

రాధికా శరత్ కుమార్ రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధిక భర్త శరత్ కుమార స్థాపించిన   ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని ఇటీవల బీజేపీలో విలీనం చేశారు. ఈ  క్రమంలో రాధికకు  బీజేపీ ఎంపీ టికెట్ ను కేటాయించింది. 

విరుదునగర్‌ లోక్ సభ స్థానంలో రాధికకు పోటీగా  దివంగత సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కుమారుడు విజయ్ ప్రబాకరణ్ పోటీ చేస్తున్నారు. డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు ఉంది.  వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా  మారింది.