యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో నాదల్ ఇంటిముఖం

యూఎస్ ఓపెన్  క్వార్టర్స్ లో నాదల్ ఇంటిముఖం

యూఎస్ ఓపెన్లో నాదల్ కథ ముగిసింది. క్వార్టర్స్ ఫైనల్లో నాదల్ అమెరికా ప్లేయర్  ఫ్రాన్సిస్ టోయాఫే  చేతిలో 6-4,4-6,6-4,6-3 స్కోరు తేడాతో ఘోర పరాజయం చవిచూశాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నాదల్..ఏ దశలోనూ ఫ్రాన్సిస్కు పోటీ ఇవ్వలేకపోయాడు. 

పూర్తి ఆధిపత్యం..
ఆర్థర్ ఆషే స్టేడియంలో క్వార్టర్స్ ఫైనల్లో ఫ్రాన్సిస్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. 24 ఏళ్ల అమెరికన్ ప్లేయర్ చేతిలో తొలి సెట్ ఓడిపోయిన రఫెల్..రెండో సెట్‌లో పుంజుకున్నాడు. సూపర్ స్మాష్ లు, లాంగ్ ర్యాలీలతో  ఫ్రాన్సిస్పై ఆధిపత్యం చలాయించి..6-4తో రెండో సెట్ను కైవసం చేసుకుని మ్యాచ్ ను సమం చేశాడు. కీలకమైన మూడో సెట్‌లో ఫ్రాన్సిస్ తిరిగి పుంజుకుని..నాదల్పై  పైచేయి సాధించాడు. రఫెల్ నే రఫ్పాడిస్తూ..6-4 తేడాతో మూడో సెట్లో  విజయం సాధించాడు. నాలుగో సెట్‌లోనూ ఇదే జోరును కొనసాగించి..సెట్తో పాటు..మ్యాచ్ను దక్కించుకున్నాడు.

 

తొలి ఓటమి..
2022లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించిన నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ టైటిల్‌ను ముద్దాడాడు. అయితే  వింబుల్డన్ 2022లో సెమీస్ చేరినా..గాయం కారణంగా  టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న నాదల్.. యూఎస్ ఓపెన్‌ టైటిల్పై కన్నేశాడు. అయితే క్వార్టర్స్ ఫైనల్లో  ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓడి..ఇంటిముఖం పట్టాడు. ఈ ఏడాది నాదల్కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. 

నమ్మలేకపోతున్నా..
నాదల్ ను ఓడించడం సంతోషంగా ఉందని ఫ్రాన్సిస్ టోయాఫే తెలిపాడు. నాదల్ ను ఓడించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. నాదల్ టెన్నిస్ లెజెండ్ అని..అతన్ని ఓడించానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. 

 ఫ్రాన్సిస్ రికార్డ్
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆండీ రిడ్డిక్, జేమ్స్ బ్లేక్ నాదల్ను ఓడించారు. ఇక ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఫ్రాన్సీస్ (24) గుర్తింపు సాధించాడు.