
పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ పంజా విసిరిన సంగతి తెలిసిందే.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ భూభాగంలో ఉమ్మడి వైమానిక దాడులు పారరంభించాయి. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు ( స్కాల్ప్ స్ట్రామ్ షాడో క్రూయిజ్ మిస్సైల్ ), హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రితో కూడిన రాఫెల్ జెట్ లతో 9 ఉగ్రవాద స్థావరాలపై ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడి చేసింది భారత్.
ఇండియన్ నేవీ ఫోర్సెస్ మద్దతుతో ఇండియన్ ఎయిర్ స్పేస్ నుండే ఈ దాడులు జరిగాయి.. ఇది సముద్ర, వైమానిక దళాల కోఆర్డినేటెడ్ ఆపరేషన్. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక మందుగుండు సామగ్రిని ఉపయోగించారని, ఒక్క భారతీయ విమానాన్ని కూడా కోల్పోలేదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో సైన్యం, నావికాదళం, వైమానిక దళం మల్టీ టార్గెట్స్ తో రంగంలోకి దిగాయి.
SCALP missile (Storm Shadow), part of IAF’s Rafale arsenal,is a stealthy cruise missile with 560+ km range,450 kg warhead & terrain hugging strike precision. Now adapted for high altitude ops in Ladakh. A game changer for deep strike capability. #UPSC #Defence #IAF #IndianArmy pic.twitter.com/xNtXO1GG6x
— Durgesh Borse (@Durgesh_Borse26) May 7, 2025
ఆపరేషన్ సిందూర్ కింద, బహవల్‌పూర్, మురిడ్కే, గుల్పూర్, భింబర్, చక్ అమ్రు, బాగ్, కోట్లి, సియాల్‌కోట్, ముజఫరాబాద్‌లోని తొమ్మిది స్థానాలపై దాడి చేసింది భారత్.