రాగ్ మయూర్ హీరోగా ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి కో ప్రొడ్యూసర్. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.
తాజాగా కశ్మీర్‌లోని పహల్గామ్, శ్రీనగర్ ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ షూటింగ్ చేసిన తొలి సినిమా ఇది. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌తో దాదాపుగా ఎనభై శాతం షూట్ పూర్తయింది. నవంబర్ చివరి వారంలో నెక్స్ట్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ప్రిన్స్ సెసిల్, అనన్య, చారిత్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. బ్రహ్మాజీ, అజయ్, సీనియర్ నటి రాశి యూనిక్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
పహల్గాం 2022 ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
