- స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు తెప్పిస్తూ.. గోడ కుర్చీ వేయిస్తూ ఇబ్బందులు.. నిలదీసిన హౌస్ సర్జన్పైనా దాడి
- 12 మందిపై క్రిమినల్ కేసులు, ఆరు నెలలు సస్పెన్షన్!
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జూనియర్ స్టూడెంట్స్ ను ఫైనలియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్చేశారు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కింది నుంచి తెప్పిస్తూ, గోడ కుర్చీ వేయిస్తూ, కూలర్లలో నీళ్లు పోయిస్తూ ఇబ్బందులు పెట్టారు. విషయం తెలిసి నిలదీసిన హౌస్‌సర్జన్‌పై ఏకంగా దాడులకు తెగబడ్డారు. దీంతో విషయం బయటకు రావడంతో 12 మందిని ప్రిన్సిపాల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..
ఉస్మానియా డెంటల్ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థులను ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొంతకాలంగా ర్యాగింగ్చేస్తున్నారు. ఆరు నెలలుగా వారితో సిగరెట్లు తెప్పించుకుంటున్నారు. ఎప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ఇచ్చినా జూనియర్లే కిందకు వెళ్లి డబ్బులు కట్టి మరీ తీసుకురావాలి. ఎండాకాలం కూలర్లలో నీళ్లు నింపాలి. అందులో నీళ్లు అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జూనియర్లదే. చెప్పిన పని చేయకపోయినా, ఆలస్యమైనా గోడ కుర్చీ వేయించేవాళ్లు. చాలాసార్లు శారీరకంగా కూడా హింసించారు.
ప్రిన్సిపాల్ హెచ్చరించినా మారలే..
ర్యాగింగ్జరుగుతున్న విషయం ఈ నెల 9వ తారీఖున ప్రిన్సిపాల్సర్జీవ్సింగ్యాదవ్కు తెలిసింది. దీంతో ఆయన సదరు విద్యార్థులను పిలిచి హెచ్చరించారు. మరోసారి ర్యాగింగ్ జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనవసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, మొదటి తప్పుగా భావించి వార్నింగ్ఇచ్చి వదిలిపెట్టారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.
తప్పని చెప్పిన హౌస్‌సర్జన్‌పై దాడి..
ప్రిన్సిపాల్హెచ్చరించినా ఫైనల్ఇయర్చదువుతున్న విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్చేయడం మానలేదు. ఇంకా ఎక్కువగా టార్చర్చేయడం మొదలుపెట్టారు. మళ్లీ విషయం బయటకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ఇచ్చారు. విషయం ఓ హౌస్ సర్జన్ (పీజీ విద్యార్థి) కు తెలియడంతో అతడు ర్యాగింగ్చేయొద్దని ఫైనలియర్విద్యార్థులకు నచ్చజెప్పారు. ఇప్పటికే ప్రిన్సిపాల్‌కు తెలిసిందని, మళ్లీ తెలిస్తే భవిష్యత్నాశనం అవుతుందని చెప్పాడు. అయినా వినకపోగా, సోమవారం రాత్రి ర్యాగింగ్చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిపై దాడి చేశారు. దీంతో మంగళవారం రాత్రి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.
ఆరు నెలల సస్పెన్షన్
ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రిన్సిపాల్ నిజమేనని తేలడంతో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు వడ్డే రాహుల్, బి.వెంకటేశ్, ఎం. ఎల్లప్ప, ఎ.సుమంత్ కుమార్, జె. వినయ్, వీ. జై కిరణ్, ఎం. జగన్నాథ్, ఎం. జతీన్ రాయ్, జె.జయసింహ, ఎం. సాయి చరణ్ తేజ, ఎం. యతీశ్ చంద్ర, ఎస్.హిమగిరిని ఆరు నెలల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. బాధ్యుల తల్లిదండ్రులను పిలిపించి వారికి విషయం చెప్పామన్నారు. భవిష్యత్ లో కాలేజీలో మరోసారి ర్యాగింగ్ జరగకుండా కఠినమైన పర్యవేక్షణ చేపడతామన్నారు.
త్వరలో స్టూడెంట్స్ అరెస్ట్?
ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‌తో పాటు దాడి చేసినట్టు నిందితులపై కేసు నమోదు చేశామని సుల్తాన్ బజార్ సీఐ నరేశ్ తెలిపారు. పలు సెక్షన్లతో పాటు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టామన్నారు. విచారణ పూర్తి కాగానే స్టూడెంట్స్ ను అరెస్ట్ చేస్తామన్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. నిందితుల పాత నేర చరిత్ర (హిస్టరీ)ను కూడా వెరిఫై చేస్తున్నామన్నారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరిగితే విద్యార్థులు వెంటనే యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు.
