చంద్రముఖి 2 .. వెట్టియాన్ రాజాగా లారెన్స్

చంద్రముఖి 2 .. వెట్టియాన్ రాజాగా లారెన్స్

రాఘవ లారెన్స్ మోస్ట్  ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ చంద్రముఖి 2. పి వాసు డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్  ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో లారెన్స్ వెట్టియాన్ రాజాగా కనిపించనున్నారు. ఈ లుక్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుటుంది.  గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమాను  2023 సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. 

తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం  విడుదల కానుంది. ఈ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్, వడివేలు, రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

2005లో రజినికాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ కావడంతో  ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.