కృష్ణంరాజు ప్రేమను మిస్ అవుతున్నా.. రాఘవ లారెన్స్ ఏమోషనల్

కృష్ణంరాజు ప్రేమను మిస్ అవుతున్నా.. రాఘవ లారెన్స్ ఏమోషనల్

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి విషయాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు రాఘవ లారెన్స్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటంతో ఆయన్ను కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సెట్లో ఉన్నప్పుడు ప్రతొక్కరిని తన పిల్లల్లాగే చాలా కేర్ తీసుకుంటారన్నారు. పిల్లల ఆలనా పాలనా తల్లి ఎలా చూస్తుందో ఆయన కూడా అలాగే వ్యవహరించే వారని కొనియాడారు.

సెట్లో ఉన్నప్పుడు సినిమా సభ్యులు తిన్నారా లేదా ఆరా తీస్తారని, తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నట్లు చెప్పారు. గతంలో కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘రెబల్’ సినిమా చేశారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఆయన ఫాంహౌస్ లో సోమవారం జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. కుటుంబ సభ్యులు, బంధువులు కృష్ణంరాజుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్న ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు.