'రుద్రుడు'గా లారెన్స్ ఫస్ట్ లుక్

'రుద్రుడు'గా లారెన్స్ ఫస్ట్ లుక్

రాఘవ లారెన్స్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రుద్రుడు'. ఈవిల్ ఈజ్ నాట్ బార్న్ ఇట్ ఈజ్ క్రియేటెడ్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహించారు. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ  సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ రౌడీలను చితక్కొడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. 

ఫైవ్ స్టార్ క్రియేషన్స్, ఎల్‌ఎల్‌పీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేసన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్, ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథీనీ, స్టంట్స్ శివ, విక్కీ లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కు తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.