సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భాస్కర్ జక్కుల రూపొందించిన చిత్రం ‘జమాన’. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, శివకాంత్, శశికాంత్ నిర్మిస్తున్నారు. జనవరి 30న సినిమా విడుదల కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమా టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. వినోదంతోపాటు ఊహించని ట్విస్ట్‌లుఉంటాయని దర్శకుడు భాస్కర్ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.
