హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న తమన్నా.. మరోవైపు కీ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌తోనూ బిజీగా ఉంది. కెరీర్‌లో ఎంతో బిజీగా ఉన్న తమన్నా.. తన పర్సనల్ లైఫ్ విషయంలో చేసే కామెంట్స్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె.. తన లవ్ స్టోరీస్, బ్రేకప్స్ గురించి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఒకరితో ప్రేమలో పడ్డానని, కానీ అప్పట్లో తన కెరీర్ కోసం ఆ రిలేషన్‌ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని, కొన్నాళ్లకి అతను తనకు సరైన జోడీ కాదనిపించిందని, అలాంటి వ్యక్తితో రిలేషన్ కొనసాగించడం ఎంతో ప్రమాదకరమని గ్రహించి బయటపడ్డానని ఆమె తెలిపింది. ప్రేమ కంటే కెరీర్, ఆత్మ గౌరవం ముఖ్యమని కూడా తమన్నా చెప్పింది.
అయితే తమన్నా చెప్పిన ఆ డేంజర్ పర్సన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.‘లస్ట్ స్టోరీస్ 2’ సమయంలో విజయ్ వర్మతో డేటింగ్, ఆ తర్వాత బ్రేకప్ సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఇది విజయ్ వర్మ గురించి అని కామెంట్ చేస్తున్నారు. అయితే తన కెరీర్ తొలిరోజుల్లో ఎదురైన ఒక పాత రిలేషన్ గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
