Devagudi: మాస్ ఆడియన్స్‌కు ఫీస్ట్.. రియల్‌‌‌‌ ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా దేవగుడి

Devagudi: మాస్ ఆడియన్స్‌కు ఫీస్ట్.. రియల్‌‌‌‌ ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా  దేవగుడి

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘దేవగుడి’.  ఈనెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ ‘‘దృశ్యకావ్యం’ తర్వాత నేను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఫ్యాక్షన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ జరిగే కథ. రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా తెరకెక్కించాం.

స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. కొన్ని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో పాటు 11 నిమిషాల యాక్షన్‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌ హైలైట్‌‌‌‌గా నిలుస్తుంది. ట్రైలర్‌‌‌‌‌‌‌‌, సాంగ్స్‌‌‌‌కు చక్కని ఆదరణ లభించింది. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.

కీలక పాత్ర  పోషించిన నటుడు రఘుకుంచె మాట్లాడుతూ ‘దేవగుడి వీరారెడ్డి అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటించా. ఫ్యాక్షనిస్ట్‌‌‌‌   పాత్రలో నటించడం,  రియల్‌‌‌‌ లొకేషన్స్‌‌‌‌లో షూటింగ్ చేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది.  ఇందులో ఓ పాటను కంపోజ్ చేసి పాడాను. ఇక నాకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నా. మనోజ్ బాజ్‌‌‌‌పాయ్ నాకు స్ఫూర్తి. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌’ లాంటి క్యారెక్టర్స్‌‌‌‌ చేయాలనుంది’ అని చెప్పారు.